Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వదంతులు నమ్మొద్దు
- రాచకొండ సీపీ డీ.ఎస్. చౌహాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతసామ రస్యం కాపాడేందుకు పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ముస్లింలు జరుపుకొనే 'షబ్ ఏ బరాత్' పర్వదినం సందర్భంగా సీపీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎల్బీనగర్, సరూర్నగర్, రామాంతపూర్, నాచారం, మౌలాలి, పహాడీషరీఫ్ వంటి ప్రాంతాలకు వెళ్లిన సీపీ భద్రతా ఏర్పాట్లపై స్వయంగా ఆరా తీశారు. మసీదుల ప్రాంగణాల్లో అర్ధరాత్రి వరకు జాయింట్ సీపీ వి.సత్యనారాయణతో కలిసి పర్యవేక్షించారు. మంగళ వారం రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసుల నుంచి శాంతిభద్రతల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు, సలహాలను అందించారు. రాచకొండ పరిధి లోని అన్ని ప్రాంతాలలో ముస్లింలు సంతోషంగా, ప్రశాం తంగా ప్రార్థనలు జరుపుకోవడానికి పోలీసులు అవసరమైన తోడ్పాటు, సహకారం ఎప్పటికీ అందిస్తారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డిలతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.