Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి
నవతెలంగాణ-వనస్థలిపురం
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగి, ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకుని తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలని వనస్థలిపురం శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ బి.రాజ్యలక్ష్మి సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సి, డిగ్రీ డిప్లమాలతోపాటు ఎన్.సి.సి, రైఫిల్ షూటర్లో కూడా నేర్పరితనాన్ని సాధించాను అన్నారు. తాను నిర్వహిస్తున్న పాఠశాలలో 70 మంది మహిళా ఉపాధ్యాయులు విధులకు హాజరై విద్యార్థులకు బోధనలో నిమగమై ఉంటారన్నారు. ఇప్పుడు ఉన్న రోజుల్లో మహిళలు ఎవరిపై ఆధారపడ కుండా తన కష్టంపై ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. తన భర్త డి.రితీష్ కుమార్ లహరి ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నారని, తనకు ఇద్దరు కుమారులని ఆమె తెలిపారు. చదువుపై మక్కువతో ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారని, తన వంతు సేవా సహకారాలు తమ పాఠశాల విద్యార్థులకు అందజేస్తు న్నానని తెలిపారు. చదువుతోనే అభివద్ధి, చదువుతోనే ఆర్థికంగా నిలదొక్కుకోగలమని విద్యార్థులకు తెలియజేస్తూ విద్యాబోధన చేస్తున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థుల తల్లితండ్రులు కొంత సమయాన్ని తమ పిల్లలకు కేటాయించి సమాజంలో జరుగుతున్న పరిణామాలను వరకు విపులంగా వివరించాలన్నారు. సమాజంపై అవగాహన ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి తెలిపారు.