Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ డి.శిరీష, ఎంఎస్. ఓబీజేె
నవతెలంగాణ-వనస్థలిపురం
మహిళలు ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా నిలదొక్కు కోవాలని, తద్వారా కుటుంబం ఆర్థికంగా అభివద్ధి చెందుతుందని జీవన సాయి మల్టీస్పెషాల్టి ఆసుపత్రి ఎంఎస్. ఓబీజేె డి.శిరీష అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివి గత 13 సంవత్సరాలుగా వనస్థలిపురంలోని మహిళలకు వైద్య సేవలు అందిస్తూ మరింత మెరుగైన వైద్యాన్ని అందించా లన్న సంకల్పంతో జీవన సాయి ఆసుపత్రిని మల్టీస్పెషాల్టి హాస్పిటల్గా ఏర్పాటుచేసి ఆధునికరణమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వనస్థలిపురం వాసులతోపాటు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైద్య సేవలు పొందడానికి తమ వద్దకు మహిళలు అధికంగా వస్తారని అన్నారు. పీజీ చదువుతున్న సమయంలోనే 2007లో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రామదాసుతో వివాహం అయిందని, తనకు బాబు, పాప ఉన్నారన్నారు. చిన్ననాటి నుంచి డాక్టర్ చదివి పది మందికి సేవ చేయాలన్న సంకల్పంతోనే ముందుకు సాగాను అన్నారు. తన ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలకు తావు ఇవ్వకుండా నార్మల్ డెలివరీకే ప్రాముఖ్యత ఇస్తున్నట్లు డాక్టర్ శిరీష తెలిపారు. తన వద్దకు వస్తున్న మహిళ రోగులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం లో హామీ ఇచ్చారు.