Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పథకాలు
- విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
నవతెలంగాణ - మీర్పేట్
మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని అన్నారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వివరించారు. మహిళ సర్వతోముఖాభివద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. అభయహస్తం పథకం కింద రూ. 546 కోట్ల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మహిళా వికాసం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసి నటువంటి మహిళాకార్పొరేటర్లని, కోఆప్షన్ సభ్యురాలు, మహిళా పోలీసులు, వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి మహిళా సోదరీమణులు, మహిళా సంఘాల మహిళలు, మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా ఉద్యోగులను శాలువాతో సత్క రించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. అనంతరం ఎంపి సంతోష్‌కుమార్ ఛాలెంజ్‌ని స్వీకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చందన చెరువు కట్టపై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కార్పొరేటర్ సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు భారీగా హాజరైన మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.