Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మహిళలపై వేధింపులు జరుగుతున్నాయనీ, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు అన్నారు. బుధవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీహెచ్ హాజరై జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ సెక్రెటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, జె.సత్తిబాబు, జి.లక్ష్మణ్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ ఎస్పీ క్రాంతి కుమార్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్ఎస్యూఐ అధ్యక్షులు అజిత్ యాదవ్ పాల్గొన్నారు.
అడిక్‌మెట్ : మహిళా అభ్యున్నతి కోసం కృషి చేస్తాం అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ డివిజన్లోని వార్డ్ ఆఫీసులో డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ ఎమ్మెల్యే పాల్గొని పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు, డాక్టర్లను శాలువాతో సత్కరించి, వారికి స్వీట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహా, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, డివిజన్ కార్యదర్శి పోతుల శ్రీకాంత్, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, గుండు జగదీష్, వెంకటేష్, దేవయ్య, గడ్డమీద శ్రీనివాస్, రాజకుమార్ పాల్గొన్నారు.
ఓయూ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిని వారి కార్యాలయంలో కలిసి మహిళా దినోత్సవ సందర్భంగా శాలువతో పురస్కరించి అక్కడే ఉన్న పేద మహిళలకు శాలువాలతో తస్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగ రాష్ట్ర నాయకులు మోతె శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మార్కెటింగ్ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, శంకర్, నాను నాయక్, రాజ్ కిరణ్, రాజేష్ పాల్గొన్నారు.
ఓయూ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో మహిళలను బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణ, శేషు, జలందధర్, ప్రవీణ్, శ్రీనివాస్, రీసెర్చ్ స్కాలర్స్ మాధవి సుమలత, పరుశురాం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అంబర్‌పేట : మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేష్, సీనియర్ నాయకులు టి.పల్లవి, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : మహిళలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి దుర్గ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ మహిళల దినోత్సవని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల దినోత్సవం వేడుకలో పాల్గొన్న గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్,రాజు, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కాచిగూడ ఇన్చార్జి డాక్టర్ శిరీష యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్రిక్ నాగేందర్ బాబ్జి, సదానందు, బబ్లు, అంటో, తదితరులు పాల్గొన్నారు.