Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 'డిజిటల్ ఇన్నో వేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ' అనే థీమ్ రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ఫర్ ప్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్, ఈస్కీ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజెనిక్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణీతారావు, ఈస్కీ డైరెక్టర్ జి.రామేశ్వర్రావు, ఎస్పీజీఎస్ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, చీఫ్ ఏఅండ్పీ లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాధాన్య త గురించి కరుణాగోపాల్, ప్రణీతారావు, రామేశ్వర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీజీఎల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అంజలిరారు, కన్సల్టెంట్ శిరీష, పవర్, ఎనర్జీ డివిజన్ హెడ్ విద్యాసాగర్, వి.నాగేశ్వర్రావు, కె.శారదాదేవ, తదితరులు పాల్గొన్నారు.