Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
దేశంలో బలమైన మహిళ రాజకీయ ప్రముఖులతో భారత రాజకీయాల్లో మహిళల స్థానం రోజురోజుకూ పెరిగిపోతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ శెట్టిబలిజ సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఆర్‌కె ఈవెంట్స్‌ను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటులో మహి ళల భాగస్వామ్యాన్ని పెంచడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎగువ దిగువ సభలో ప్రవేశపెట్టబడిందనీ, బిల్లు రాజ్యస భలో ఆమోదం పొందిందనీ, లోకసభలో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈవెంట్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈవెంట్ నిర్వాహకులను అభినందిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో కవాడిగూడ కార్పొ రేటర్ రచన శ్రీ, మహిళా సంఘం నేతలు గంగాపురం పద్మ శ్రీదేవి, సీత, సంఘ సేవకులు మినియం బాబు, ఈవెంట్ నిర్వాహకుడు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.