Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు. బుధవారం కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నర్సింగ్ సూపరింటెండెంట్ కస్తూరి దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను శాలువాలతో సన్మా నించారు. అనంతరం సాంస్కతిక కార్యక్రమాలు అలరిం చాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ జయ మనో హరి, డాక్టర్ ఆనంద చారి, డాక్టర్ సంపత్ కుమార్ సింగ్చ డాక్టర్ రవి శంకర్, డాక్టర్ అమిత్, నర్సింగ్ సూపరిం టెండెంట్ కస్తూరి దేవి, హెడ్ నర్స్‌లు గౌరీదేవి, హనీష్ ఫాతిమా, సోషమ్మ, అనురాధ, రమణ, స్టాప్ నర్సులు ప్రశాంతి, నిర్మల, మరియమ్మ, పుష్పలత, సుజాత, బాల నక్షత్రం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.