Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలపై జరు గుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలంతా సంఘటితమై పోరాటం చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షులు కుమార్, శ్రామిక మహిళా కన్వీనర్ వాణి తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా గంటకు ఆరుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగు న్నాయన్నారు. పట్టపగలు దేశ రాజ ధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుం డా పోయిందన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని 20 ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా ఆమోదానికి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలనీ, సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వైన్ షాపులను తగ్గిస్తామని ఎక్కడా చెప్పడం లేదన్నారు. వీధికో మద్యం షాపు ఏర్పాటు చేసే విచ్చలవిడిగా మద్యం సర ఫరా చేస్తున్నారని చెప్పారు. తాగుడుకు బానిసై మహి ళలపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. మద్యపా నానికి వ్యతిరేకంగా మహిళలు కలిసి పోరాటం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో రాపర్తి అశోక్, ఎస్ శ్రీనివాస్, రిజ్వాన, పద్మ, అమృత, అనిత, కృష్ణ, రేష్మ పాల్గొన్నారు.