Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళలకు సహనం, ఓర్పు ఎక్కువేనని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యా లయంలో మేయర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో అడిషనల్ కమిషనర్లు విజయలక్ష్మి, యూసీడీ సౌజన్య, జాయింట్ కమిషనర్లు ఉమాప్రకాష్, శశిరేఖ, జోనల్ కమిషనర్ మమత, సెక్రెటరీ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ మంగతయారు, మహిళా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళలు లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా ఎన్ని అడ్డం కులు వచ్చినా లక్షాన్ని చేరేవరకు ముందుకు సాగాలని పిలుపుని చ్చారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు తదితర ఎన్నో సంక్షేమ పథకా లు కల్పించారన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే నేరుగా తనను గానీ, డిప్యూటీ మేయర్‌ను సంప్రదిస్తే కచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కడైనా వేధింపులకు గురైతే మహిళల కోసం షీ-టీమ్స్ కూడా ఉన్నాయని మేయర్ తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా శానిటరీ వర్కర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల్లో ఒక్కో సర్కిల్ నుంచి ఒక మహిళా వర్కర్ని ఉత్తమ మహిళా వర్కర్‌గా ఎంపిక చేసి అవార్డు ఇచ్చి సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళా శానిటరీ వర్కర్ల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పారిశుధ్య మహిళా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ మహిళలను సన్మానించుకోవడం వల్ల ముందు తరాల వారిని చైతన్యవంతులను చేయడానికి తోడ్పతుం దన్నారు. ఆరోగ్యం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ ఈ దినోత్సవాన్ని మొదటగా మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారని గుర్తు చేశారు. మహిళా దినో త్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో మహిళా ఉద్యోగు లు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన మహిళా ఉద్యోగు లకు బహుమతులను అందజేశారు. అనంతరం జీహెచ్ఎంసీ ఆవరణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
సీపీఆర్ఓ సెక్షన్ మహిళా ఉద్యోగులకు సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎం సీ సీపీిఆర్ఓ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు సీపీిఆర్ఓ మహమ్మద్ అలీ ముర్తుజా, ఏఎంసీ జీవన్‌కుమార్‌తో కలిసి సన్మానించారు. సన్మానించిన వారిలో సూపరింటెండెంట్లు డి. శైలజా, పద్మ, ఓఎస్. కె.లతను శాలువా తో సన్మానించి జ్జాపికను అందజేశారు. కార్యక్రమంలో మోసిన్, రోహిత్, రమేష్, ఆనంద్, మహమ్మద్ తౌఫిక్, యాదగిరి, శ్రీను, నరేందర్, నర్సింగ్, మహేందర్, అంజయ్య పాల్గొన్నారు.