Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/అంబర్పేట
హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీిఐటీయూ) కాచిగూడ రైల్వే స్టేషన్ హౌస్ కీపింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దే శించి సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధా నాలకు నిరసనగా ఏప్రిల్ 5వ తేదీన సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరు గుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఉన్న కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు మార్చి 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటల పనిని ప్రవేశపెట్టిందన్నారు. కార్మి కులను ఎప్పుడంటే అప్పుడు తొలగించే స్వేచ్ఛను యజ మానులకు అప్పగించి అదానీ, అంబానీ వంటి కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే తదితర సంస్థ లను నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ప్రయివేట్ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నదనీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా నట్టేట ముంచుతున్నదన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని విద్యుత్ సవరణ బిల్లులో పెట్టి రైతాంగానికి ద్రోహం చేస్తున్నదని చెప్పారు. తన ప్రజా వ్యతిరేక విధానాలను మరుగునపరచడానికి ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో ఘర్షణ సష్టించి తన పబ్బం గడుపుకుంటున్నదన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగ ట్టాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని తెలిపారు. హైదరాబాద్లో ఈనెల 15వ తేదీ నుండి 29వ తేదీ వరకు బస్తీ స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న సభలు, సమావేశాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నగర సహాయ కార్యదర్శి ఎస్.శ్యామలీల, నాయకులు శ్రీనివాస్, గంగారామ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.