Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ వారు ఫెలిసిటేటెడ్ కిడ్నీ డోనర్స్ అండ్ ఎక్స్‌క్లూజివ్ కిడ్నీ స్క్రీనిం గ్ ప్యాకేజ్' పా్యకజీని ప్రకటించా రు. సమాజంలో పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది రోగులకు అనుకూలమైన ధరలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌లతో సమగ్ర రోగనిర్ధారణ పరీక్షలు, సంప్రదిం పులను అందిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారించడానికి ప్రజలను ప్రోత్సహించడమే ఈ ప్యాకేజీ లక్ష్యంగా పని చేస్తుంది. హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ గంధే శ్రీధర్ మాట్లాడుతూ, ''ఈ ప్రత్యేకమైన రోజున, మేం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మాత్రమే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. కిడ్నీ దాతలలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కిడ్నీ దానం అనేది ప్రాణాలను రక్షించే శక్తిని మనం నమ్మాలన్నారు.