Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మేడ్చల్ డిప్యూటీ తహశీల్దార్గా చేస్తున్న ఫైళ్ల నవీన్ రెడ్డి రాసిన '' తెలంగాణ చరిత్ర '' '' భారత దేశ చరిత్ర '' అను పోటీ పరీక్షలకు సంబం ధించి తెలుగు, ఇంగ్లీషు మీడియం పుస్తకాలను బుధవారం ఓయూ లో డా.బి.ఆర్.అంబేద్కర్ గ్రంధాలయానికి, యచ్సిడిసి కార్యాల యనికి ఓయూ వీసీ ప్రొ.రవీందర్ సమక్షంలో ఈ 120 పుస్తకాలు అందజేశారు. ఈ రెండు పుస్తకాలు ఓయూలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ ఐతున్న విద్యార్థులు ఎంతో ఉపయోగపడుతుందని ఓయూ వీసీ అన్నారు. ఈ పుస్తకాలు గ్రూపు 1, 2, 3,4, ఎస్ఐ, కానిస్టేబుల్, డీఎల్, జేఎల్తో పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న అన్ని పోటీపరీక్షలకు ఎంతగానో వారికి ఉపయోగపడుతాయిన తెలిపారు. ఇటివల ఈ పుస్తకాలకు ఎంతగానో ఆదరణ లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యచ్సిడిసి డెరైక్టర్, డీన్ ప్రో.కె.స్టీవెన్ సన్, కో-ఆర్డినేటర్ డా.పి.మురళీధర్ రెడ్డి, లైబ్రేరియన్ డా.ఎ.ఎస్. చక్రవర్తి, నవీన్ రెడ్డి, గైడ్ ప్రో.ఎ.భాస్కర్ పాల్గొన్నారు.