Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముషీరాబాద్
75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్న భారత దేశంలో నేటికీ పార్లమెంటులో మహిళా బిల్లు పెండింగ్లో ఉండడం శోచనీయమని సౌత్ ఇండియా అడ్వకేట్స్ జేఏసీ అధ్యక్షులు ఎస్ నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బాగలింగంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం మహిళల రక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగేందర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించడానికి ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అని లింగ వివక్ష ఆడ మగ తేడా లేకుండా రాజ్యాంగంలో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిందని తెలిపారు.ఈ సందర్భంగా పలు రంగాలలో విశేషంగా సేవలందిస్తున్న సామాన్య మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా, వనిత, పుష్ప, వీరయ్య తదితరులు పాల్గొన్నారు మహిళా బిల్లుకు మోక్షం లేకపోవడం శోచనీయం