Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్, ఏఆర్వో నర్సింహారెడ్డి
- మైక్రోఅబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఓపీవోల శిక్షణ కార్యక్రమం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాకు చెందిన మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఓపీవోలు తమ విధులు ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఈనెల 13న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంద ర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయంలతో కలిసి మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీవోలతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఏఆర్వో నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమితులైన మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.అధికారులు ప్రతి ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికా రులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కూడా అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండా లని ఏదైనా కారణాలతో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహిం చలేనట్టయితే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా సంసిద్ధంగా ఉండాలని ్డ సూచించారు. ప్రతీ ఎన్నికల మాదిరిగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా నిర్వహించాలన్నారు. అధికారులు చేయాల్సినవి చేయకూడని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగిందని అదనపు కలెక్టర్, స్పష్టం చేశారు. జిల్లాలో 14 పోలింగ్ స్టేషన్లకుగాను 8 పోలింగ్ కేంద్రాలు కీసర డివిజన్ లో, మరో 6 పోలింగ్ కేంద్రాలు మల్కాజిగిరి డివిజన్ లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 3,038, మహిళా ఓటర్లు 3,498 మంది ఉన్నారని వివరించారు. ఓటింగ్, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇంకా ఏమైనా అంశాలు తెలియకపోయినా సందిగ్ధం ఉన్నా ముందు గానే వాటిని తెలుసుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సరి చూసుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, ఎన్నికల మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
మహిళలు సమాజం లో ఆదర్శవంతంగా ఉండాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోస ియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులకు చెస్, క్యారమ్, వీల్ చైర్ పోటీలు కూడా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి మాట్లాడుతూ, మహిళల పట్ల చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా సాగుతున్నదన్నారు. ప్రస్తుతం దేశ రాష్ట్రపతిగా మహిళ ఉన్నా , వెనక్కి పోయి చూస్తే, ఎంత మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉండేవారో మనకు తెలియని విషయం కాదన్నారు. ఇప్పటికీ కొన్ని మధ్య ప్రాశ్చ్యా దేశాలలో మహిళలు రాజకీయ పదవులకు పోటీ చేసే హక్కు లేదంటే మహిళల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో స్పష్టమవు తోందన్నారు. వారితో పోల్చు కుంటే మనమే కొంత బెటర్ అన్నారు. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువు దీరుతారని నానుడి ఉన్నా, స్త్రీలను దేవతలుగా కాకపోయినా కనీసం వ్యక్తిగా నైనా గౌరవించాల్సిన అవసరం ఉందనీ ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా క్రీడా పోటిలలలో గెలుపొ ందిన మహిళలు అధికారులను అదనపు కలెక్టర్ సత్కరించి, మెముంటోలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో లింగ్యా నాయక్ , జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆఫీసర్ రాంచందర్ , స్పోర్ట్స్ ఆఫీసర్ బలరా మరావు, లా ఆఫీసర్ చంద్రావతి, డీఈఓ విజయ కుమారి, ఉద్యా న శాఖ అధికారినీ నీరజా గాంధీ, జలవనరుల శాఖ అధికారి రేవతి, జిల్లా మత్స్య శాఖ అధికారినీ పూర్ణిమా సింగ్, లేబర్ ఆఫీసర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.