Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పుట్ల శ్రీనివాస్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మహిళలు బాధ్యతగా విధులు నిర్వహిస్తే గుర్తింపు వస్తుందని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వైద్య ,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారంజిల్లా కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు వారు సన్మానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతరం జిల్లా ఆరోగ్యశాఖ అభివద్ధి కోసం కషి చేస్తున్న మహిళ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు గౌరవం, సంరక్షణ, మద్దతు ,ప్రేరణ అవసరం అని, నేటి స్త్రీ ఒకరిపై ఆధారపడిన ఆత్మ కాదు అని , ప్రతి విషయంలో స్వతంత్ర ,స్వావలంబన ప్రతీ రంగంలో రాణించే సామర్థ్యం ఉంది అని పేర్కొన్నారు.
జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారిని శేషు పద్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మన్మధమ్మా , సీనియర్ అసిస్టెంట్ అనిత , పద్మ, జిల్లా ప్రొగ్రమ్మె అధికారి( ఎన్ఎచ్ఎం) మంజుల రెడ్డి, ఎపిడెమియాలజిస్ట్ నాగ లక్ష్మి, టైపిస్ట్ జేవీడీ మారుతీ, జిల్లా అకౌంట్స్ మేనేజర్ (ఎన్ఎచ్ఎం) శ్రీ విద్య, అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు దివ్య, సుప్రియ, నాల్గవ తరగతి ఉద్యోగులు అమరేశ్వరి, సరోజినియమ్మలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా అధికారి వేణు గోపాల్ రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ పాలు బాయి ఈశ్వర్, సూర్య ప్రకాష్ , సూపర్వైజర్ శ్రీకాంత్ రెడ్డి , సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, గిరి కాంత్, జూని యర్ అసిస్టెంట్లు జేమ్స్ దాస్ , శ్రీకాంత్ , అక్షయ్, శ్రీచంద్ జిల్లా డేటా మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.