Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్
నవతెలంగాణ-జవహర్‌నగర్
అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం కార్పొరేషన్‌లోని 8వ డివిజన్ సంతోష్‌నగర్ కాలనీవాసుల సొంత నిధులతో డిప్యూటీ మేయర్ సహకారంతో 100 మీటర్ల భూగర్భ డ్రయినేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సమస్యలు లేని కార్పొరేషన్ తీర్చిది ద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, మంత్రి మల్లారెడ్డి సహకారంతో జవహర్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో ప్రగతికి దూరంగా ఉన్న కార్పొరేషన్.. నేడు ప్రగతి పనులతో విరాజిల్లుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, హహ్మద్సాధిక్, మల్లారెడ్డి, నర్సింహులు, చంద్రయ్య, భారతి, హారిక, కళావతి, రమా, కాలనీవాసులు పాల్గొన్నారు.