Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోర్డు మాజీ సభ్యురాలు ప్యారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య సంఘ కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహిళల మధ్య కేక్ కట్ చేశారు అనంతరం సంబరాలు ప్రారంభించారు మహిళలు బతుకమ్మ, దాండియా ఆడుతూ సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్ కుమార్, పాండు యాదవ్, బీఆర్ఎస్ నేత ముప్పిడి మధు కర్తో పాటు టీంశ్యామ్ అన్న యువసేన ఏడో వార్డు సభ్యులు, స్థానిక మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇచ్చే సంస్కృతి తెలంగాణదన్నారు. కార్యక్రమంలో మహి ళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు.