Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జై జవాన్ కాలనీ రీడింగ్ రూమ్ హాల్ నందు మహిళా నాయ కులకు సన్మానం చేశారు. మున్సిపల్ శ్రామిక మహిళ కె మాధవి, వికలాంగుల హక్కుల సాధన నాయకురాలు అమ రావతి అమ్మ లకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు పి.తిరుమలయ్య యాదవ్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న అమరా వతి అమ్మకు, కాలనీ పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న మున్సిపల్ కార్మికురాలు కె మాధవిలకు కమిటీ తరఫున సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. వీరిని గౌరవించి సన్మానం చేయడం అంటే మన మహిళలం దరినీ మనం గౌరవించుకున్నట్టేనని అన్నారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) కాప్రా కార్యదర్శి పి వెంకట్, కాలనీ అసోసియేషన్ నాయకులు ఎస్ఎం సాహెబ్, జి సత్యనారా యణ,సలీం, కే నారాయణ, జీ ఆర్ రెడ్డి నగర్ అధ్యక్షులు అల్లూరయ్య, మున్సిపల్ జవాన్ అశోక్ పాల్గొన్నారు.