Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనదారులు పోయేదెట్టా....?
నవతెలంగాణ- నేరేడ్ మెట్
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల్లో నూతన ఇండ్ల నిర్మాణం చేపడుతున్న సమయంలో రహదారులపైనే ఇసుక ,కంకర , సిమెంట్ ఇతర సామగ్రి వేయడంతో ఆ దారిన వెళ్ళే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇండ్ల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది నెలల తరబడి వీటిని రోడ్లు పైనే ఉంచడంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి వేయొద్దని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసు కుంటామని అధికారులు అంటున్నా ఆచరణలో ఎక్కడ ఇది అమలు కావడం లేదని పలువురు అంటున్నారు. రోడ్లు పైనే ఇసుక, కంకర, ఇటుక తదితర సామగ్రి ఏడాది పొడవునా దారులపై ఉంటుందని.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ సంఘాలు పిర్యాదు చేసిన చర్యలు కరవయ్యాయని వారంటున్నారు. కొన్ని చోట్ల దారి పైనే వాచ్మెన్ నివాసానికి గుడిసెలు వేస్తున్నారని, దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. చాలా సార్లు వాహనదారులు, యజమానులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.