Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం
- ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ దాడులు : తీన్మార్ మల్లన్న
- పోలీసుల అదుపులో దాడిచేసిన వ్యక్తి
- మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలను నిరంతరం ఎండగడుతున్నందుకే తమ కార్యాల యంపై బీఆర్ఎస్ పార్టీ గూండాలు మారణాయుధాలతో వచ్చి దాడి చేసి కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడికి పాల్ప డ్డారని క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం నాడు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి సిబ్బందిపై దాడిచేసి కార్యాలయంలోని కంప్యూటర్లు, అద్దాలు, ఫర్నిచర్ ను పూర్తిగా ద్వంసం చేశారని తెలిపారు. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ మంత్రుల హస్తం ఉందని మల్లన్న ఆరోపించారు. పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం,పేపర్ లీకేజ్ వెనక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనే విషయాన్ని క్యూ న్యూస్‌లో ప్రసారం చేయడం, లిక్కర్ స్కామ్ లాంటి కథనాలను ప్రసారం చేయడం ఇష్టంలేకనే ఇలా దాడులకు పాల్పడినట్లు మల్లన్న తెలిపారు. దాడికి వచ్చిన వారిలో ఒకరిని పట్టుకున్నామని, అతడిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం మల్లన్న టీం సభ్యులు మేడిపల్లి పీఎస్ వరకు ర్యాలీగా వెళ్ళి మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సీపీిఐ (ఎంఎల్)ఆర్ఐ సిటీ కార్యదర్శి ఆర్.సంతోష్
నవతెలంగాణ-హయత్‌నగర్
క్యూ న్యూస్ ఆఫీస్‌పై అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడం, ఆఫీసులోని అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేయడం, ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ (ఎంఎల్ ) ఆర్ఐ సిటీ కార్యదర్శి ఆర్.సంతోష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళం వినిపిస్తు హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం హేమమైన చర్య అన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాల అవినీతిపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తు, ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.