Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసి లోని అన్ని యానిమల్ కేర్ సెంటర్స్‌ని గత నాలుగు వారాలుగా పర్యవేక్షించిన తర్వాత హై లెవెల్ కమిటీ మెంబర్స్ మరియు అన్ని జోన్ల వెటర్నరీ అధికారులతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీలోని అన్ని జోన్లలో కావలసిన వెటర్నరీ ఇన్ఫాస్ట్ట్రక్చర్, సిబ్బంది కొరత, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తీసుకో వాల్సిన జాగ్రత్తలు, మొదలగు అంశాలపై సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది. దీనిపై పూర్తి రిపోర్ట్ తయారుచేసి త్వరలో కార్యరూపం దాల్చడానికి మేయర్‌కి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హై లెవెల్ కమిటీ మెంబర్స్ మరియు అన్ని జోన్ల వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.