Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
సమాజంలో ప్రజల దాహార్తని తీర్చటానికి వేసవి కాలంలో చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడు తాయని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్ మల్లాపూర్లో స్థానిక నాయకులు రియా సత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, కార్పొరేటర్ బాలునాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బొర్ర జగన్రెడ్డి, నాయకులు ప్రవీణ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.