Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-జవహర్‌నగర్
అమాయక నిరుద్యోగ విద్యార్థులను ఆసరాగా చేసుకొని నకిలీ విద్యా ధ్రువపత్రాలను అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ సీఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం... జవహర్ నగర్ కార్పొరేషన్‌కు చెందిన నలుగురు సభ్యులు సులభంగా డబ్బులు సంపాదించాలని ముఠాగా ఏర్పడి షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్, సర్వేపలి ్లరాధాకష్ణ యూనివర్సిటీ జతేడీ, భోపాల్, విలీ యంకేరీ యూనివర్సిటీల నుంచి నకిలీ విద్యా ధ్రువప త్రాలను సేకరిస్తూ అమాయకులకు అమ్ముతూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరే షన్లో భాగంగా నకిలీ ధ్రువపత్రాల రాకెట్‌ను పట్టుకు న్నారు. నిందితులు బర్ల శంకర్రావు, భానుచందర్‌రెడ్డి, తిరు పతి శ్రవణ్‌కుమార్, దాయక సాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 25నకిలీ విద్యా సర్టిఫికేట్లు, 5 సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.