Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్స్ కాలుష్య నియంత్రణ చర్యలకుగాను 'సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గ్రీన్ అవార్డ్'
- సర్టిఫికెట్స్‌తో ప్రయోజనాలు : ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరాం వెంకటేష్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మరొక గుర్తింపు పొందింది. పలు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ''స్టాండెడ్ ఆర్గనైజేషన్ - అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్ఓ) నుంచి ఇటీవల గుర్తింపు పొందినట్టు ఇంజినీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరాం వెంకటేష్ పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో అందిస్తున్న విద్యతోపాటు పలు అంశాల పై ఐఎస్ఓ బందం ఫిబ్రవరిలో కళాశాలలో 7 విభాగాలు, మెస్‌లలో తనిఖీలు చేసి సర్టిఫికెట్స్ జారీ చేసినట్టు వారు చెప్పా రు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికే షన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ ఇలా 7 విభాగాలతో పాటు గంగ, కిన్నెర బాలికల మెస్‌లు, కళాశాల క్యాంటీన్లకు కూడా ఐఎస్ఓ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ గుర్తింపు 2026 మార్చి 12 వరకు ఉంటుంది. మళ్లీ ప్రతి ఏడాదీ రివ్యూ (ఆడిట్) మేరకు ఈ బృందం తనిఖీలు చేస్తుంది. గతంలో 22ఏండ్ల క్రితం ఈసీఈ, సీఎస్ఈ విభాగాలకు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి కావడంతో ఆ రెండు విభాగాలు సర్టిఫికేట్స్ పొందాయి.
ఇటివలే సాధించిన ప్రగతి
ఈ మధ్యకాలంలో యూజీ, పీజీ కోర్సులకు మూడేండ్ల పాటు 'ఎన్బీఎ' అక్రిడేషన్ రావడంతో పాటు నూతనంగా ప్రవేశ పెట్టిన యూజీ కోర్సులు మైనింగ్ ఇంజినీరింగ్‌కు ఏఐయంఎల్, పీజీ మైనింగ్ లాంటి కోర్సులకు ''ఎఐసీటీఈ '' గుర్తింపు కూడా లభించిన విషయం తెల్సిందే.
పొందిన సర్టిఫికెట్స్
ఐఎస్ఓ - 9001 సర్టిఫికెట్ సాధించింది. పర్యావరణ గ్రీన్ ఆడిట్లో ఐఎస్ఓ 14001, ఎనర్జీ ఆడిట్లో ఐఎస్ఓ 50001 ధ్రువీకరణ లభించింది. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న గంగా, కిన్నెర, బాలికల హాస్టల్ మెస్‌లు, ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లకు ఫుడ్ సెఫ్టీ ఐఎస్ఓ - 22000తో గుర్తించింది.
విద్యా వికాసంలో విశేష కృషి
ఇంజినీరింగ్ కళాశాలలో 7 విభాగాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యూజీ, పీజీ విద్యను అందించటంలో భాగంగా పైల్స్, రికార్డ్స్, ఫైల్స్ సేఫ్టీ, నిర్వహణలో చొరవతో పాటు, వికలాంగులకు సౌకర్యాలు కల్పించడం, కరిక్యులము డిజైన్, అమలు కూడా క్వాలిటీ పాటించడం ఒక భాగమే.
గ్రీన్ ఆడిట్
ఇక ఇది కూడా ఒక భాగమే. కళాశాల లోపల ఆరుబయట, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం, ప్రతిష్టాత్మకంగా వ్యర్ధాల నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణం నిర్మాణంలో ప్రమాణాలు పాటించారు.
ఎనర్జీ ఆడిట్లో ముందు
విద్యుత్ పొదుపునకు తగిన చర్యలు, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని సోలార్ విద్యుత్ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు ఫలించడం. ఇవి కూడా దోహద పడ్డాయి సర్టిఫికెట్స్ జారీలో.