Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిమెట్ల సురేష్ రెడ్డి
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
సుభాష్‌నగర్ 130 డివిజన్ పరిధిలోని ప్రియాంక నగర్ లో ఆదివారం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా స్థానికులతో కలిసి పాదయాత్ర చేసిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ఈ సందర్భంగా సురేష్ రెడ్డికి పూలమాలలు వేస్తూ బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ''జై రాజన్న'' ''జై సురేష్ రెడ్డి'' అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. బస్తీ బాట కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చిన కరెంట్, డ్రైనేజ్ ,పారిశుధ్య సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ...ఇప్పటికే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను చాలా వరకు పూర్తి చేస్తామన్నారు. గల్లీ లలో సిమెంట్ రోడ్లను వేసుకున్నాము. అలాగే ఇంకా మిగిలిన మెయిన్ రోడ్లను, కమిటీ హాల్ లను పూర్తి చేసే బాధ్యత నాది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ కమిటీ సభ్యులు రాము, సురేష్ నిర్మల, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, గోవర్ధన్ రెడ్డి , మైపాల్ రెడ్డి , పులి, రమణ, సుగుణ, గోపాల్, యాదగిరి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.