Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1975ను 1977గా మార్చి ఉద్యోగమిచ్చారు
- డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సర్టిఫై చేసింది 1975
- బాధితురాలే ట్యాంపరింగ్ చేసినట్టు మెమో జారీ
- ట్యాంపరింగ్ చేయలేదు : బాధితురాలు
- ఈఎన్సీ రిజక్ట్ చేయడంతో విషయం వెలుగులోకి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉన్నత చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగం సాధించడమంటే అషామాషీ కాదు. అయితే పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించడం, కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కు చనిపోతే వారసత్వ ఉద్యోగం రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటిని అన్ని రకాల అర్హతలు, చదవులు, సర్టిఫికెట్లు కూడా అవసరమే. కాని జీహెచ్ ఎంసీలో మాత్రం అవేవి ఉండవు. నిబంధనలు పట్టవు. వాళ్లు అను కుంటే ఏమైనా చేస్తారు. అనుకోకపోతే అసలు చేయరు. సంబం ధిత అధికారులకు నచ్చితే మాత్రం అర్హతలేకున్నా ఉద్యోగం గానీ, ప్రమోషన్గానీ ఇచ్చేస్తారు. ఓ కారుణ్యనియామకం విషయం లో ఏకంగా మార్కుల మెమోనే టాంపింగ్ చేశారంటే ఆ అధికా రులకు ఏస్థాయిలో ఉన్నతాధికారుల మద్దతు ఉందో చెప్పాల్సి నవరంలేదు.
మెమో టాంపరింగ్...
జీహెచ్ఎంసీలో ఓ ఉద్యోగి మరణిస్తే కారుణ్యనియామకం కింద సదరు ఉద్యోగి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని బల్దియా నిర్ణయించింది. అయితే ఎవరికి కారుణ్య నియామకమైనా సర్టిఫ ికెట్లను పరిశీలించడం మొదలు స్థానిక పోలీసులు సైతం విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సదరు వ్యక్తికి నియామక పత్రం అందజేస్తారు. కానీ బల్దియాలో అలా జరగలేదు. ఓ మహిళకు ఆమె పదోతరగతి మార్కుల మెమోలో ఉన్న పుట్టిన సంవత్సరం 1975 ప్రకారం ఉద్యోగం రాదని తెలిసిన అధికారులు ఏకంగా మార్కుల మెమోలోనే పుట్టిన సంవత్సరాన్ని మార్చేశారు. 1975ను 1977 మార్చి 15 డిసెంబర్ 2021న జూనియర్ అసిస్టెంట్‌గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) కార్యాలయానికి కేటాయించారు. సదరు మహిళకు సంబంధించిన సర్టిఫికెట్లను ఈఎన్సీకి పంపించారు. సర్టిపికెట్లను పరిశీలించిన ఈఎన్సీ పదోతరగతి మార్కుల మెమోను టాంపరింగ్ చేసినట్టు గుర్తించి తిరస్కరించారు. అయితే టాంపరింగ్ వివాదం తమ మెడ కు చుట్టుకోకుండా ఓ తెల్ల కాగితంపై సదరు మహిళతో సంతకం పెట్టించుకుని ఆమెనే టాంపరింగ్ చేసినట్టు కట్టుకథ రాశారు. ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు.
అంతా డ్రామా
పదో తరగతి మార్కుల మెమోను టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫైల్‌ను ఈఎన్సీ వెనక్కి పంపించడంతో పరిపాలన విభా గం అధికారులు కంగుతిన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకో వడానికి ఉద్యోగం పొందడానికి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని, దీనికి సమాధానం ఇవ్వాలని సదరు మహిళకు 15 జులై 2022న పరిపాలన విభాగం అదనపు కమిషనర్ పేరుతో మెమో జారీచేశ ారు. అయితే పరిపాలన విభాగం ఇచ్చిన మెమోకు సదరు మహిళ ఘాటుగా సమాధానమిచ్చారు. 'నేను ఏలాంటి టాంపరింగ్‌కు పాల్పడలేదు. నాపై మోపిన ఆరోపణల్లో నిజంలేదు. ఎలాంటి విచా రణ లేకుండా మెమో జారీచేయడమేంటి? దయచేసి మెమోను వెనక్కి తీసుకోవాలి' అంటూ 16 జులై 2022న కమిషనర్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అటు ఉద్యోగం రాక, ఇటు జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టు తిరగలేక ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు, ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న విషయం బయటికొస్తుందని డ్రామా ఆడుతున్నారని ఓ యూనియన్ నేత అభిప్రాయపడ్డారు.
డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్
కారుణ్యనియామకం కింద ఉద్యోగం ఇచ్చే ముందు పుట్టిన సంవత్సరాన్ని క్లారీఫై చేసుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కు లేఖ రాశారు. దీంతో పరిశీ లించిన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి సదరు మహిళ పుట్టిన సంవత్సరం 1975గా గుర్తించి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(పరిపాలన)కు లెటర్ రాశారు. పదోతరగతి టీసీ, బోనాఫైడ్లోనూ 1975అనే ఉంది.
కమిషనర్ బదిలీ కోసం
మార్కుల జాబితాను టాంపరింగ్, సదరు మహిళకు మెమో జారీ చేయడం, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నుంచి క్లారిఫై ఇవ్వడం అంతా జరిగిపోయింది. అయినా ఆ ఫైల్‌ను బయటికి రాకుండ పరిపాలన విభాగంలోని ఓ కీలక అధికారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు కమిషనర్ లోకేష్‌కుమార్ బదిలీ అయినా వెంటనే కొత్తగా ఆర్డర్ తీసి ఏదో సర్కిల్‌కు పంపించాలని పథకం వేసినట్టు తెలిసింది. ఇదిలా ఉం డగా ఆ అధికారి ఏది చెబితే అది క్షణాల్లో జరిగిపోతుంది. అందుకు పరిపాలన విభాగం అదనపుకమిషనర్, కమిషనర్ సైతం ఆమోద ముద్ర వేయాల్సిందే. ఏది చేసినా దానివెనుక ఏదో స్టోరీ చేసుకుని సిద్ధం చేసుకుని కమిషనర్ దగ్గరకు వెళ్తాడు. ఆ స్టోరీ వినగానే అదనపు కమిషనర్, కమిషనర్ ఫైల్‌పై సంతకం చేస్తారు తప్ప పరిశీలించి పక్కకు పెట్టిన దాఖల్లేవని కొంత మంది అధికారులు అంటున్నారు. పైగా ఆ అధికారికి కమిషనర్, మేయర్ పేషీల్లోనూ, జోనల్, సర్కిల్ కార్యాలయాలతోపాటు ఆయా విభాగాల్లో తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగులు ఉండడంతో ఏ ఫైల్ వచ్చినా, ఏం జరిగినా క్షణాల్లో సమాచారం పోతుంది. ఆయనపై ఏమైనా రిమార్కుల ఫైల్ వచ్చిదంటే మధ్యలోనే గయాబ్ చేసే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోవడంలేదని పలువురు యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.