Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి
- జేవీవీ హైదరాబాద్ నగర కమిటీ ప్లీనరీ సమావేశాలు
నవతెలంగాణ-అంబర్‌పేట
సైన్స్‌తోనే దేశం అభివృద్ధి చెందుతుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి అన్నారు. జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ ప్లీనరీ సమా వేశాలు ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సమావేశాలకు జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సైన్స్ లేనిది సమాజం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. కానీ సైన్స్ ఫలాలు బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయన్నారు. సైన్స్ ఫలాలు దేశంలోని ప్రజలందరికీ దక్కాలని.. అప్పుడే సమాజం మరింత ఉన్నతంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి రాజా మాట్లాడుతూ ఒకవై పు దేశం ఆధునిక టెక్నాలజీతో పురోగమిస్తుంటే మరోవైపు అదే స్థాయిలో మూఢ విశ్వాసాలు ప్రజలను పీడిస్తున్నాయని తెలిపారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా మూఢ విశ్వాసాలు మరింతగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ సైన్స్ కార్యకర్త మూఢనమ్మకాలపైన పోరాడి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. మూఢ నమ్మకాలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని కోరారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర రావుపే, కార్యదర్శిగా లింగస్వామి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా మరో ఐదుగురికి అవకాశం కల్పించారు.