Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-అంబర్పేట
సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామీగా నిలుస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని ఎస్వీ ఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పార్టీ నగర ఇన్చార్జి దాసోజు శ్రావణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ. విజరు కుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు లాంటి అనేక ప్రజాకర్షక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కానీ ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ నిత్యావసర సరుకుల ధరలను పెంచి సామాన్య జనంపై పెనుబారం మోపుతున్నదని అన్నారు. మూడు పర్యాయాలు అంబర్పేట ఎమ్మెల్యేగా గెలిచిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి రాష్ట్రానికి గాని, పార్ల మెంటు అంబర్ పేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు తెచ్చిన దాఖలు లేవని కేవలం మతపదికంగా చిచ్చు పెడుతూ పబ్బం కడుతూ ఓట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకా లను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కషి చేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయ కులు కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. సీనియర్ నాయ కులు లవంగు ఆంజనేయులు, ఎర్రబోలు నరసింహారెడ్డి, అమునూరి సతీష్ బాబ్లీ, రామారావు యాదవ్, లింగా రావు, మల్లేష్ యాదవ్,రాగుల ప్రవీణ్ పటేల్, జాఫర్, మహేష్ ముదిరాజ్, జాకీ బాబు,మల్లికార్జున్ యాదవ్, స్టీవెన్ రూబీ, లవంగు నాగరాజ్, రంగు ఉదరు కిరణ్ గౌడ్, చేగురి దినేష్,వంజరి నాగరాజు, నర్సింగ్,దయాకర్ యాదవ్, శ్రీనివాస్,నాగరాజు,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.