Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు ధారబోత
- మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ యుద్ధానికి సిద్ధం కావాలని, ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు ధారబోస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డి అన్నారు. సోమవారం అంబర్‌పేట తిలక్‌నగర్ సిగల్ వద్ద బీజేపీ, మతో న్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు మహేందర్, జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఐద్వా కార్యదర్శి నాగలక్ష్మి, సీఐటీయూ కార్యదర్శి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు శ్రీని వాసరావు, యాత్ర ఇన్చార్జి మారన్న హాజరయ్యారు. ఈ సంద ర్భంగా నంద్యాల నర్సిరెడ్డి మాట్లాడుతూ మోడీ అమిత్‌షాల నేతృ త్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయన్నారు. దేశమంటే అంబానీ ఆదానిలా సొత్తుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారని అన్నారు. రూ. లక్షల కోట్లు ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తూ భూములను మార్కెట్లను పరిశ్రమలను ఉపాధి కల్పించే రంగాలను పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా ఒక్క శాతం ఉన్న బడా కార్పొరేట్ వద్ద 40 శాతం సంపద పోగు పడిందని తెలిపారు. ప్రపంచ మానవ అభివద్ధి ఆకలి సూచికలో మన దేశం 141 స్థానంకి దిగజారిందని.. విద్యలో 30వ స్థానంలో ఉందన్నా రు. రూ. లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి ప్రతీ కుటుంబానికి 15 లక్షలు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి గద్దెనెక్కి మోసం చేశారన్నా రు. తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద మనం రోజు వాడుకునే ప్రతీ వస్తువు మీద జీఎస్టీ విధించి నిత్యావసర ధరలను ఆకాశానికి అందేలా చేశారని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు తీసుకువచ్చి అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ చట్టాన్ని అమలు చేస్తూ రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న మోడీ విధానాల వల్ల ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నా రు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, 2006 అడవి హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని రైతాంగం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకే భాష పేరుతో హిందీ సంస్కృతిని మనపై రుద్దుతున్నారన్నారు. విద్యలో జ్యోతిష్యాన్ని పాఠ్యాంశాంగా మార్చారన్నారు. దళిత, గిరిజన, మహిళ, మైనారిటీ బీసీలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించి సాధించిన స్వతంత్ర భారతం నేడు మతోన్మాదుల కూరల్లో చిక్కి విలవిలలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకిస్తూ మార్చి 29న ఇందిరా పార్క్ వద్ద జరుగు భారీ బహిరంగ సభను భారీగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యవర్గ సభ్యులు ఎం మహేంద ర్, ఐద్వా కార్యదర్శి నాగలక్ష్మి సీఐటీయూ కార్యదర్శి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, మోహన్, రాములు, సుబ్బారావు, నిరంజన్ పాల్గొన్నారు.