Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా సౌత్ జిల్లా కార్యదర్శి పి.శశికళ
నవతెలంగాణ-హైదరాబాద్
పేదల నోటికాడి బువ్వను కేంద్ర బీజేపీ పాలన లాగేస్తున్నదని ఐద్వా సౌత్ జిల్లా కార్యదర్శి పి.శశికళ అన్నారు. 4 రోజులుగా హైదరబాద్ సౌత్ జిల్లాలో కార్మివా డలు పర్యటించిన ప్రజా సంఘాల జీపు జాతా సోమవారం ఇంద్రానగర్ సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీని అక్రమంగా రద్దు చేసి రూ.560 ఉన్న ధరను రూ.1155లకు పెంచింద న్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలన వల్ల పేద కుటుంబాల మహిళలు స్టవ్ ఆన్ చేయాలంటే ఎప్పుడు గ్యాస్ అయిపోతుంది? మళ్లీ అన్ని డబ్బులు ఎక్కడ అప్పు తెచ్చి చెల్లించాల్సి వస్తుంది ? అని ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా నాయకులు పి.నాగేశ్వర్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి పరోక్షంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వే షన్ల ద్వారా పొందే ఉద్యోగాలు లేకుండా చేశారన్నారు. సహజ వనరులను అదానీ, అంబానీలకు అప్పగించి వారిచ్చే లంచాలతో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తున్నార న్నారు. ప్రశ్నించే వారిని జైళ్ల పాలు చేస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.