Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
- రామంతపూర్ డివిజన్లో డ్రయినేజీ సివరేజి పనులు ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్
రామంతపూర్ డివిజన్లోని సాయి కృష్ణ కాలనీలో మౌలిక వసతులకు పెద్దపీట వేసి అన్ని రంగాలలో అభివద్ధి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు సోమవారం రూ. 30 లక్షలు 34 లక్షల వ్యయంతో డ్రయి నేజీ సివరేజి పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవా ణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పోరేటర్ మాట్లాడుతూ రామంతపూర్ భగాయ త్లోని అన్ని కాలనీలకు రోడ్లు డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి కాలనీల రూపురేఖలే మారుస్తామని పేర్కొన్నారు. జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్, డీజీఎం రజనీకాంత్ రెడ్డి, మేనేజర్ పల్లె రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, శాగ రవీందర్, ఎం. డి. ముస్తాక్, జహంగీర్, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
హైదరాబాద్ : కల్యాణ లక్ష్మి వంటి పథకాలు నిరుపేదలకు వరం లాంటివని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే, కార్పో రేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సైజన్ శేఖర్, బండారు శ్రీవాణి , జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవి, గారికే సుధాకర్, డివిజన్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ముత్యం రెడ్డి, ముస్తాక్, కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తాసిల్దార్, ఫీల్డ్ అసిస్టెంట్ సుధా తదితరులు పాల్గొన్నారు.