Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారు నర్సింగ రావు
- సీపీఐ(ఎం) నేరేడ్ మెట్ డివిజన్ కార్యదర్శి
నవతెలంగాణ-నేరేడ్మెట్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 28న తలపెట్టిన జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) నేరేడ్మెట్ డివిజన్ కార్యదర్శి బంగారు నర్సింగ రావు పిలుపు ఇచ్చారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్లోని ఆర్కేపురం, అంతయ్య కాలనీలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసన గా అదిలాబాదు నుండి ప్రారంభమైన (బస్సు యాత్ర) జనచైతన్య యాత్ర మంగళవారం మధ్యాహ్నం 3.00గంటలకు ఔషపూర్ ఘట్కేసర్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ యాత్ర ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ వరకు ఉంటుందన్నారు. అనంతరం ఈసీఐఎల్ చౌరస్తాలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ ఉంటుం దని తెలిపారు. అధిక సంఖ్యలో రెడ్ షర్ట్లు/రెడ్ చీరలు ధరించి వాహనా లతో యాత్రలో పాల్గొనేం దుకు ఔషాపూర్ చేరుకో వాలని ఆయన కోరారు. సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తానందు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సుమిత్ర, సునంద, నాగమణి, పద్మ, లక్ష్మీబాయి, మంజుల, నర్సమ్మ, బుజ్జి, లత తదితరులు పాల్గొన్నారు.