Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాస్య నందిత
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మంట. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం. నిరంతరం కృషి చేస్తానని దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్య నందిత అన్నారు. సోమవారం మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, జేపీి నగర్, లోయా నగర్లలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. ముఖ్యంగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, మంచినీరు సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కషి చేస్తానన్నారు. దివంగత ఎమ్మెల్యే జీ సాయన్న గతంలో డ్రైనేజీ సమస్య తీర్చుటకు నిధులు మంజూరు చేశారని, అందులో భాగంగా మరో వారం వ్యవధిలో డ్రైనేజీ పనులు ప్రారంభమ వుతాయని ఆమె వెల్లడించారు. అనంతరం లోయ నగర్లో పర్యటించి అంగన్వాడి కేంద్రం కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నివేదిత, టీిఎన్ శ్రీనివాస్, పనస సంతోష్, నాగనేని సరిత, సదానంద్ గౌడ్, సంతోష్ యాదవ్, పిట్ల నగేష్, నారాయణ, రాజయ్య, భాస్కర్, నిత్యానంద్, మురళి యాదవ్, తేజ్పాల్, కాశీరెడ్డి, నరేష్, శేఖర్, జోడీ బ్రదర్స్, నర్సింగ్, రాము, భవాని, శివకుమార్, వాజిద్, భసీర్, ఝాన్సి పాల్గొన్నారు.