Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఫౌండేషన్‌తో విద్యా శ్రీ హైస్కూల్ కృషి చేస్తుందని జియాగూడలోని విద్యా శ్రీ హైస్కూల్ చైర్మన్ శ్యామ్ వేరా తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్కూల్లో నిర్వహించే ఎక్స్ పో - 2023 బ్రోచర్‌ను ఆయన డైరెక్టర్ సునీత శ్యామ్ వేరాలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పో - 2023లో విద్యార్థులు ఏది చదివి నేర్చుకున్నారో వాటిని ప్రాక్టికల్‌గా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ వంటి వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలలో నుంచి సేకరించిన సుమారు 500 రకాల ఎక్స్పోలను ప్రదర్శిస్తారన్నారు. నిరుపేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్కూల్లో లక్ష్మీ భూమా ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్, స్కాలర్షిప్లు అందజేస్తున్నామన్నారు. వీటితోపాటు విద్యార్థి దశలోనే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ఉచిత కంప్యూటర్ విద్య, స్పెషల్ ట్యూషన్స్, ఆధునిక తరగతి గదులతోపాటు అత్యాధునిక విధాన వాష్ రూమ్స్, విద్యార్థులతో పాటు స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అందరికీ ఆర్వో ప్యూరిఫైయర్ స్వచ్ఛమైన మంచినీరు వంటి సౌకర్యాలను కల్పిస్తూ విద్యాబోధనలో అందిస్తున్నామని వెల్లడించారు. ఆటపాటలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామన్నారు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్న సుమారు 700 మంది విద్యార్థులు వారు విద్యనభ్యసించిన ప్రతిభను ప్రాక్టికల్ రూపంలో ప్రదర్శిస్తారని వివరించారు. ఈ ఎక్స్ ఫోను ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు ఎం.అరవింద్ కుమార్ గౌడ్, గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్, జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, కులుసుంపుర ఇనిస్పెక్టర్ అశోక్ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు.