Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ జోర్క గీత శ్రీరాములు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని కౌన్సిలర్ జోర్క శ్రీరాములు అన్నారు. అభివృద్ధిలో భాగంగా 20వ వార్డులో ఆరు లక్షల నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్రెడ్డిలతో కలిసి వార్డు కౌన్సిలర్ జోర్క గీత శ్రీరాములు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ జోర్క గీత శ్రీరాములు మాట్లాడుతూ 20వ వార్డులోని సన్రేసు కాలనీ రోడ్ నెం.5లో 6లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. దశలవారీగా వార్డులోని సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందేవిధంగా కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు జోర్క రవి, పృధ్వి, రమేష్, నరేందర్, రామకృష్ణ, సోమేశ్, సతీష్, ఆంజనేయులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.