Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అచ్చం మన ఇంటి దగ్గరే ఉన్న వాతావరణంలో అందించే సేవలను జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్, కైట్స్ సీనియర్ కేర్ లో అందిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. తెలంగాణలో వారి కార్యకలాపాల విస్తరణకై మంగళవారం బంజారాహిల్స్లో అత్యాధునిక సౌకర్యవంతమైన సెంటర్ను ప్రారంభించారు. జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్ కైట్స్ సీనియర్ కేర్ వృద్ధులకు సంరక్షణ సేవలను అందిస్తుంది. వృద్ధులకు వయస్సు రీత్యా వచ్చే కొన్ని దీర్ఘకాల రుగ్మతలకు, కొన్ని రకాల శస్త్రచికిత్సల, జబ్బుల చికిత్సల తర్వాత అవసరమయ్యే సేవలు, హాస్పిటల్స్ నుంచి డిస్చార్జ్ అయిన తర్వాత పునరావాస సంరక్షణ, పాలియేటివ్ కేర్, డిమెన్షియా కేర్లను కైట్స్ సీనియర్ కేర్ దాని ప్రత్యేక సంరక్షణ సౌకర్యాలతో కూడిన ''ఆసుపత్రికి వెలుపల'' సంరక్షణ సేవలను అందిస్తుంది. వృద్ధుల ఇంటివద్ద కూడా సేవలను అందిస్తుందన్నారు. హాస్పిటల్కు వెలుపల సేవలను అందించే ఈ కొత్త సౌకర్యం బంజారాహిల్స్లో దాదాపు 30 వేల చదరపు అడుగుల భవంతిలో 90 పడకలతో ఏర్పాటు చేయబడింది. విలాసవంతమైన ఎయిర్ కండిషన్డ్ గదులు, హై డిపెండెన్సీ యూనిట్ పడకలు, కన్సల్టేషన్ సూట్లతో పాటు పెద్ద ఆధునిక థెరపీ హాల్, ఆయుర్వేద థెరపీ రూమ్లు, ప్రార్థన గది యాక్టివిటీ హాల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. రాజగోపాల్ జి, డాక్టర్ ఎఎస్ అరవింద్, డాక్టర్ రీమా నాడిగ్ స్థాపించిన జెరియాట్రిక్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన కైట్స్ సీనియర్ కేర్, డే-కేర్ సేవలను కూడా అందించాలని యోచిస్తోందని వారు తెలిపారు. పెరుగుతున్న సీనియర్ సిటిజన్స్ జనాభాతో హైదరాబాద్లో ఇలాంటి సదుపాయాలను, సేవలను అందించే సౌకర్యాలకు అపారమైన అవసరము ఉన్నది. మన దేశంలో వృద్ధాప్య సంరక్షణ సేవల మార్కెట్ 20 బిలియన్లు, 7శాతం వృద్ధ పెరుగుతోంది. మన దేశ జనాభాలో దాదాపు 11శాతం మంది 65 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు. 2050 నాటికి దేశ జనాభాలో 20శాతం మంది 60 ఏండ్లు పైబడి ఉంటారని ఒక నివేదిక పేర్కొందని వివరించారు.