Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక విజన్‌తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్‌గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేస్తున్నారని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి అధ్యక్షతన చంపాపేట డివిజన్ పరిధిలోని శుభం ప్యాలస్‌లో పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులచే మరియు బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంపాపేట అంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రజల అండదండలు ఉన్నంత కాలం సీఎంను ఎవరూఏం చేయలేరన్నారు. స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పి ఇంత వరకు ఎందుకు వేయలేదో ప్రధాని చెప్పాలని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గతంలో నీటి కోసం యుద్ధాలు చేసిన సందర్భాలు కోకొల్లలుగా చూశామని తెలిపారు. బిందెలతో రోడ్లపై క్యూలు కట్టిన రోజులు చూశామని, మహిళల నీటి కష్టాలు చూసిన సీఎం కేసీఆర్ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి తాగునీళ్లు అందిస్తున్నది వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా నీటి సమస్యను పరిష్కరించామన్నారు. నగరంలో ఎలా అయితే నీళ్లు ఇస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లోనూ మిషన్ భగీరత నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీి మంచినీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇట్టి కార్యక్ర మంలో ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా, కార్పొరేషన్ చైర్మెన్ అమరవాది లక్ష్మీ నారాయణ, తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి, నల్ల రఘుమరెడ్డి, ఒరుగంటి వెంకటేశం గౌడ్, సుంకోజు కష్ణమాచారి, మహిళా అధ్యక్షు రాలు రోజారెడ్డి, మాజీ అధ్యక్షులు చీర శ్రీనివాస్, శ్రీకాంత్, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్తలు యాదిరెడ్డి, జంగయ్య, జంగారెడ్డి, మల్లేష్‌గౌడ్, రంగారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, ప్రభాకర్, గోపాల్, వెంకటేష్, అంజిరెడ్డి, బొంబాయి, దుర్గారెడ్డి, ఉమమహేశ్వర్, కట్ట వెంకటేష్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రకాష్, జంగయ్య, అనసూయ, రమాదేవి, రజని, ఉషా, వసంత, పుష్ప, లక్ష్మీ, నర్మద, విజయలక్ష్మి, శ్రీనాధ్, కళ్యాణ్, కిరణ్ మరియు పలువురు నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, పలు విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.