Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
జీవో నెం.58 కింద అర్హులైన వారందరూ ఇళ్ల స్థలాలకు సంబం ధించి పట్టాలు పొందాలని, ఇంకా ఏదైనా కారణం వల్ల దరఖాస్తు చేసుకోలేని వారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం అబ్దుల్లాపూర్మెట్ మండలం కేంద్రంలో వివిధ గ్రామాల పరిధిలోని జీవో నెం.58 కింద అర్హులైన 483 మంది లబ్ధిదారులకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి అధ్యక్షత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండ్లకు ఇంటి పట్టాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని,వారి అందరి దష్ట్యా సీఎం కేసీఆర్ జీవో నెం.58 తీసుకువచ్చి పేదలకు ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకంతో ప్రతి ఇంటిలో జ్యోతి వెలుగుతుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ స్థలములో ఉంటూ ఆర్థిక స్తోమత లేక గోడల వరకే ఇల్లు నిర్మించుకున్న వారు గహ లక్ష్మీ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేపట్టుకోవా లన్నారు. నియోజక వర్గంలో మూడు వేలమంది ఇంటి నిర్మాణం చేపట్టు కోవచ్చని తెలిపారు. లేదంటే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేస్తారని, అందుకే గహ లక్ష్మీ పథకంను వినియోగించుకోవాలన్నారు. ప్రతి లబ్ధిదారునికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణ, లక్ష్మి షాదీ ముబారక్ పథకంను సీఎం కేసీఆర్ తీసుకొచ్చి ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుం దన్నారు. అలాగే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలతో అనేకమందికి కంటి పరీక్షలు పరీక్షించుకొనే అవకాశం తీసుకొ చ్చారని తెలిపారు. ఇలాంటి బహత్తర కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చి ప్రజల్లో మన్నన్నలు పొందుతు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంకు వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మున్పిపల్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజరుశేఖర్రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, తహాసీల్దార్ అనిత రెడ్డి, ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ గౌడ్, జెడ్పీిటీసీి బింగ్ దాస్ గౌడ్, సర్పంచులు చెరుకు కిరణ్ కుమార్ గౌడ్, పోచంపల్లి సుధాకర్ రెడ్డి, వెంకటేష్, తుడుము మల్లేష్, లతశ్రీ గౌరీశంకర్ చారి, కొర్ర లావణ్య, ఏసురి పారిజాత శేఖర్, ఎంపిటిసిలు సీక సాయికుమార్ గౌడ్, బాల లింగస్వామి, కె.వెంకటేష్, రాచపాక లావణ్య, కౌన్సిలర్స్ విద్యావతి, రోహిణిరెడ్డి, రెవెన్యూ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.