Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై అనేక మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ శ్రీరామ కాలనీకి చెందిన వివిధ పార్టీల యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపటి పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీకి చెందిన 40 మంది యువకులు జల్ పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షలో క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని దేశ భవిష్యత్తు, యువకులందరిపైనే ఆధారపడి ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడాలని పనిచేసే ప్రతి కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కే.లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, యువ నాయకులు యంజాల అర్జున్, బీసీ సెల్ మున్సిపల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్, 16వ వార్డు అధ్యక్షులు పోలేమోనీ నాగేష్ ముదిరాజ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సూరెడ్డి సత్తిరెడ్డి, కొంగర సుభాష్, గుండు నర్సింగ్, రాజు, మున్సిపల్ మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ, మహిళా నాయకురాలు జి.లక్ష్మి, మాజీ వార్డ్ మెంబర్ కరణమ్మ, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.