Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన హైలె వల్ కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యు లతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయ ర్ మాట్లాడుతూ ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్లో తీర్మా నం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరుగుతుం దని, మిగతా అంశాలు వెంటనే అమలు చేయాలని అధికారు లను ఆదేశించారు. కుక్కల నియంత్రణ చర్యలతో పాటు శానిటేషన్ మెరుగుపరిచేం దుకు వచ్చే వారం ఏర్పాటు చేసే సమావేశంలో చర్చించడం జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. అంతకు ముందు శానిటేషన్ పై జరిగిన సమా వేశంలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, దాంతో పాటుగా హౌటల్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్ల ఆహార వ్యర్థాలను వెంటనే తరలించేందుకు ఒక్కొ క్క హౌటల్‌కు, ఫంక్షన్ హాల్‌కు ఒక వాహనం కేటాయిం చాలని అదేవిధంగా హౌటళ్లు, ఫంక్షన్ హాల్స్ వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని శానిటేషన్ ఇన్చార్జి, అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. రాంకీ ద్వారా సెకండరీ చెత్త సేకరణ మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సమావేశంలో హై లెవెల్ కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, శ్రవణ్, రజిత పరమేశ్వర్ రెడ్డి, సీఎన్ రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, మిర్జా ముస్తఫా బేగ్, సయ్యద్ సోహెల్ ఖాద్రి, పద్మ, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, మమత, అశోక్ సామ్రాట్, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్. జోనల్ డిప్యూటీ డైరెక్టర్లు, వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.