Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ రాష్ట్రంలో వరుస పదవ తరగతి పేపర్లు బయటకు రావడంపై తక్షణమే సమగ్రమైన విచారణ జరిపిం చాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్ మాట్లడుతూ రాష్ట్రంలో వరుసగ పేపర్ లీకుల ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించలేదని, విద్యార్ధులకు భరోసా ఇచ్చేలాగా ప్రభుత్వం స్పందించాలని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కూడా ప్రభుత్వం ప్రకటనలు నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలాగా లేవని, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని, గ్రూప్-1, ఇతర పరీక్షలు వాయిదా, రద్దు వల్లన నష్టపోయిన విద్యార్ధులకు నెలకు 20,000/- రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 5 యేండ్ల నుండి ఫీజు రీయంబర్స్మెంట్స్, స్కాలర్ షిప్స్ 5వేల కోట్లు రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం విడుదల చేయాలని, వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం మరింత కేంద్రీకరణ పెట్టాలని అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు లక్షల రూపాయల పెంచుతున్నారని, వాటిని ప్రభుత్వం నియంత్రించేందుకు చట్టం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.