Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాల నిర్వహణ, తెలుగు భాషకు సంబంధించిన జాతీయ సెమినార్లలో కేంద్ర సాహిత్య అకాడమి తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీ శంకర్ కోరారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి జానపద సాహిత్యంపై తొలి పి.హెచ్.డి. చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల జాతీయ సెమినార్ను నిర్వహించతలపెట్టామని, అందులో భాగస్వాములు కావాలని కేంద్ర సాహిత్య అకాడమి జనరల్ కౌన్సిల్ను కోరారు. కేంద్ర సాహిత్య అకాడమి జనరల్ కౌన్సిల్ సభ్యులు బుధవారం రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మెన్తో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా భవిష్యత్తులో చేయ బోయే సాహిత్య కార్యక్రమా లపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు సాహిత్యాన్ని ఈ తరం వారి దగ్గరకు తీసుకు పోయేందుకు ప్రణాళికలు తయారు చేయాల న్నారు. ఇందుకు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భం గా నూతనంగా ఎన్నికైన కేంద్ర సాహిత్యకాడమీ జన రల్ కౌన్సిల్ నూతన కార్య వర్గం తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొఫెసర్ సి.మణాళిణి, జనరల్ కౌన్సి ల్ సభ్యులు ఆచార్య ఎస్వి సత్యనారాయణ, ప్రసేన్ మందలపర్తి కిషోర్లను తెలంగాణ సాహిత్య అకా డమి చైర్మెన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమి కార్యదర్శి ఎన్. బాలాచారి పొల్గొన్నారు.