Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ - కూకట్పల్లి
తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు చివరకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడ్డానికి కూడా వెనుకాడటంలేదని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కష్ణారావు మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 10వ తరగతి పరీక్ష పత్రాలు లీకేజీపై అసహనం వ్యక్తపరి చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ కార్యకర్త బూర ప్రశాంత్ ఫోటోలు తీసి, వాటిని బీజేపీీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకి వాట్సాప్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని, అసలు ఇటువంటి కుట్రలు, కుతంత్రాలతో విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తం చేయడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న దీని వెనకాల ఉద్దేశం ప్రత్యక్షంగా బయటపడిందని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరని, బండి సంజరుకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులని, దేశానికి వెన్నుముక అన్న నానుడి కూడా మరిచిపోయి చివరకు వీరి రాజకీయ లబ్ధి కోసం పిల్లలను పావులుగా వాడుకోవడం నిజంగా క్షమించలేని నేరమని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమా వేశంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, అవుల రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.