Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్ క్లబ్ ప్రతినిధులు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరమని లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ (నార్త్) ప్రతినిధులు అన్నారు. బుధవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దుమ్‌నగర్ భగత్‌సింగ్ మార్గ్‌లో గల శ్రీసాయి విద్యానికేతన్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ (నార్త్) ఆధ్వర్యంలో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (సూరారం) వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ (నార్త్) ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమా లతోపాటు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వివిధ భాగాలకు చెందిన ఎనిమిది మంది సాధారణ, ఎముకల, దంత వైద్యనిపుణులచే పాఠశాల విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులకు సుమారుగా 350 మంది వరకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మల్లారెడ్డి ఆస్పత్రి సిబ్బంది పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్(నార్త్) డిస్ట్రిక్ట్ చైర్మెన్ లయన్ చల్లా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు లయన్ బి.శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు లయన్ వినోద్ కుమార్ జాదవ్, ప్రధాన కార్యదర్శి, పాఠశాల కరస్పాండెంట్ లయన్ బిర్రు ఆంజనేయులు, ప్రిన్సిపల్ బిర్రు శోభారాణి, ఉపాధ్యాయులు ప్రశాంతి, కష్ణవేణి, మల్లారెడ్డి హాస్పిటల్ ఇన్చార్జ్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.