Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీసీఎల్ఏ 475 ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
- జిల్లా డీఐఈవో ఒడ్డెన్నకు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏప్రిల్ 1 నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చూడాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల లెక్చరర్ల అసోసియే షన్(జీసీఎల్ఏ 475) విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కె.పి.శోభన్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ క్యాంప్ కస్తూర్బా జూనియర్ కాలేజీలో లంచ్ విరామ సమయంలో కాంట్రాక్ట్ అధ్యాపల క్రమబద్ధీకరణ జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతూ మౌన ఆవేదనను తెలియజేశారు. క్రమబద్ధీకరణ జీవో కోసం రాష్ట్రంలోని 11,108 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం హైదరాబాద్ క్యాంప్ ఆఫీసర్ డీఐఈవో ఒడ్డెన్నకు వారు వినతి పత్రం అందజేశారు. అలాగే సీఎం కేసీఆర్కు మెయిల్ ద్వారా తమ ఆవేదనను చేరవేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.