Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ గౌడ్
నవతెలంగాణ- సరూర్నగర్
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ గౌడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5 కే వాక్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి డీసీపీ సాయి శ్రీ గౌడ్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి లు ముఖ్యఅతి థులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి శ్రీ గౌడ్ మాట్లాడుతూ నడక అన్ని వయ సుల ప్రజలలో శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవన శైలికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మంచి వ్యాయా మము, ఉన్నత చదువులతో యువత మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్లు డా. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, సీఓఓ డాక్టర్ కరుణాకర్ రెడ్డిలు మాట్లాడుతూ తమ సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు ఉత్తమమైన వైద్య సదుపాయాలు కలిగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.