Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ దళితుల పాలిటా రాపోలు రాములు శని లాగా దాపురించాడని, తోటి దళితుల అభివద్ధిని సహించ లేకనే బోడుప్పల్ దళితుల అభివృద్ధి కోసం తన వంతుగా సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై,మంత్రి మల్లారెడ్డి పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని బోడుప్పల్ అంబే ద్కర్ యువజన సంఘం నాయకులు మండి పడ్డారు. శుక్రవారం బోడుప్పల్‌లోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బోడుప్పల్ దళితులకు చెందిన 336 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కు తీసుకున్న తమ భూమిని అభివద్ధి చేయాలని దరఖాస్తు చేసుకున్నా మని అన్నారు. దరఖాస్తుకు స్పందించిన సర్కారు అమోదం తెలిపేందుకు ముందుకు వచ్చిందని దానిని సహించలేని రాపోలు రాములు అతని అనుచరులు కుటిలా యత్నాలు మొదలు పెట్టి 60 మంది దళిత కుటుంబాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దళితుల పేరు చెప్పుకుని అందరినీ మోసం చేసిన ఘనత రాపోలు రాములుకే దక్కిందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం తిరుగుతున్న అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులను అవహేళన చేస్తు మాట్లాడే రాపోలు రాములు గత ముప్పై సంవత్సరాల నుంచి ల్యాండ్ పూలింగ్ కోసం తిరిగి ఏం పని చేసిండని ఎదురు ప్రశ్నించారు.పెద్ద కంచె భూమి కోసం దళితులకు చెందిన విలువైన అనేక భూములను అమ్మించిన రాపోలు రాములు ఆస్తులు కూడా పెట్టుకున్న మాటా వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిత్యం బద్ద శత్రువులుగా ఉండే రాపోలు కిష్టయ్య, నత్తి మైసయ్యలతో ఏకమై పేద దళితుల పొట్టకొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాడని అన్నారు. అమాయకపు దళితులు ఎవ్వరూ రాపోలు రాములు మాటలు నమ్మడం లేదని తెలిపారు.ఇప్పటికైన తన నీచపు చేష్టలు మానుకుని దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకుని పేదల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిన్నింగిల కుమార్,ప్రధాన కార్యదర్శి చీరాల జంగయ్య, నాయకులు మీసాల కష్ణ, కామగళ్ల నరసింహ,రాపోలు శంకరయ్య,నారాయణ,చంటి శ్రీనివాస్, రాపోలు ఉపేందర్,ఎర్రమైసిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.