Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజన్ టు యాక్షన్ పేరుతో వర్చువల్ కాన్ఫరెన్స్
నవతెలంగాణ-బడంగ్పేట్
ది పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్,కళాశాల ఆధ్వర్యంలో ఆరోగ్యం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగిందని ప్రొఫెసర్ అంజుం సినియా అన్నారు. గురువారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్ గుల్ డీబీఎస్ స్కూల్లో ప్రిన్సిపాల్ పద్మ జ్యోతి తురగ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ది పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, కళాశాల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020- విజన్ టు యాక్షన్ పేరుతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ వాటాదారులు హాజర య్యారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆరోగ్యం, సంరక్షణ 2020పై కార్యక్రమం నిర్వహించారు. ప్యానలిస్ట్‌లుగా పాలసీ ఫ్రేమ్‌వర్క్ నిపుణులు, విద్యావేత్తల శ్రేణిని ప్రదర్శిం చారు. అంతర్జాల ప్రత్యక్ష కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020 ఆరోగ్యం,సంరక్షణ అంశంపై విధాన నిర్ణేతలు, నిర్వహణ,జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తల సమాధానాలను వినడానికి వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశంలో విద్య భవిష్యత్తును రూపొం దించడంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రాము ఖ్యతను వివరించే డీబీఎస్ నాదర్గుల్ ప్రిన్సిపాల్ పద్మ జ్యోతి తురగ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అంజుమ్ సిబియా, డాక్టర్ సెంథిల్ కుమారన్, ప్రొఫెసర్ వి సత్యనారాయణ,డాక్టర్ ఎ.జగదీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య సంరక్షణ, విద్య, ప్రొఫెసర్ అంజుమ్ సిబియా సామాజిక-భావోద్వేగ అభ్యాసం ప్రాముఖ్యతను తెలిపారు. ప్రొఫెసర్ సిబియా ప్రకారం, పిల్లల మొత్తం అభివద్ధికి సామాజిక-భావోద్వేగ లక్ష్యాలను వివరించారు. విద్యార్థులకు క్రీడల పట్ల అవగా హన కల్పించాలని దీనితో విద్యార్థులకు మానసిక ఉల్లాసం తో పాటు మనోదైర్యం కల్గుతుందన్నారు.ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.