Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-జవహర్నగర్
తెలంగాణ రాష్ట్రం క్రీడలకు, క్రీడాకారులకు నిలయం గా నిలుస్తుందని, క్రీడలతోనే చిన్నారుల భవిష్యత్తు ఆధార పడి ఉందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. క్రీడాకారులు రాష్ట్ర, అంతర్జాతీయస్థాయిలో రాణించి గొప్ప పేరుప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. రణ్వీర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు బ్లాక్ బెల్టుల్లో ప్రావీణ్యం సాధించిన వారికి శుక్రవారం మంత్రి సమక్షంలో బెల్టులు ప్రదానం చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నదని, గత ప్రభుత్వాలలో క్రీడా మైదానాలే కరవయ్యేవని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ పల్లెకు, పట్టణానికి ఆట స్థలాలు ఇచ్చారని అన్నారు. అనంతరం రణ్వీర్ తైక్వాండో విద్యార్థులను అభినందిం చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నిహారికగౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రమేషాచారి, బూడిద వెంకటేష్, రణవీర్ తైక్వాండో మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
కార్పొరేషన్లోని బీజేఆర్ నగర్ కు చెందిన ధనూష్ అనారోగ్యానికి గురై సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకో గా మంజూరైన రూ. 35వేల చెక్కును మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి మెట్టు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
అరుంధతినగర్కు నేడు మంత్రి మల్లారెడ్డి రాక
కార్పొరేషన్లోని అరుంధతినగర్కు శనివారం మంత్రి మల్లారెడ్డి రానున్నారు. శుక్రవారం కార్పొరేషన్లో బీఆర్ఎస్ 16వ డివిజన్ ఇంఛార్జీ సత్యం మాట్లాడుతూ.. అరుంధతినగర్ బస్తీ దవాఖానా, పలు అభివద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రి వస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.